బాలీవుడ్ రీ-ఎంట్రీపై రైమా సేన్!

9
- Advertisement -

బాలీవుడ్‌లో తిరిగి ఎంట్రీ ఇస్తున్న రైమా సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తర్వాత హిందీ చిత్రాల్లోకి వస్తున్న రైమా,…ఇక్కడ రోల్స్ విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉండలేను అని స్పష్టం చేశారు.

హిందీ ఇండస్ట్రీకి తిరిగి రావడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. కానీ ఈసారి కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది అని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె హన్సాల్ మెహతా తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ బిజినెస్ సినిమాలో నటిస్తున్నారు.

తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, 17 ఏళ్ల వయసులోనే వినయ్ శుక్లా దర్శకత్వంలో వచ్చిన గాడ్ మదర్ ద్వారా ఎంట్రీ ఇచ్చానని చెప్పారు. ఆ సమయంలో షబానా అజ్మి వంటి ప్రముఖులతో నటించడం చాలా భయంగా అనిపించిందని గుర్తుచేసుకున్నారు.

ALso Read:బాధితుల ఫోటోలతో పాక్‌కు ఇరాన్ ప్రతినిధులు

తన తల్లిదండ్రులు Moon Moon Sen, Bharat Dev Varma తమపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని చెప్పారు. మీరు సినిమాల్లోకి రావాలంటే మీ ప్రయాణం మీరు స్వయంగా సాగించాలి” అని మాత్రమే చెప్పారు. అలాగే, తమ తప్పుల నుంచి నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చారని తెలిపారు. బాలీవుడ్‌లో ఫేవరిటిజం, నెపోటిజం గురించి చర్చ ఎప్పుడూ ఉంటుంది. కానీ చివరికి నిలబడేది ప్రతిభ ఉన్నవారే. కుటుంబ వారసత్వం అవకాశాలు ఇస్తుంది కానీ నిలబడటానికి ప్రతిభ అవసరం అని అభిప్రాయపడ్డారు.

- Advertisement -