సక్సెస్ అయితేనే ప్రశంసలు!

9
- Advertisement -

బాలీవుడ్ పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దర్శకుడు అనురాగ్ కశ్యప్. ఇండస్ట్రీలో సినిమాలు సక్సెస్ అయిన తర్వాతే ఎక్కువ మంది ప్రశంసిస్తారని ఆయన తెలిపారు. తన సినిమాలకు ఇతరులు అంతగా ప్రశంసలు ఇవ్వకపోవడంపై ప్రశ్నించగా, అనురాగ్ స్పందిస్తూ…నేను సినిమాలను ప్రేమిస్తాను. నాకేమైనా సినిమా నచ్చితే వెంటనే ప్రశంసిస్తాను. కానీ అందరూ అలానే చేయాలని బలవంతం చేయలేను అన్నారు.

ప్రస్తుతం ఆయన డెకాయిట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితేనే అందరూ వచ్చి దాన్ని మెచ్చుకుంటారు. ముందుగా ఎవరూ ముందుకు రావడం చాలా అరుదు అని పేర్కొన్నారు. దీనిపై ఆయన సహనటి మృణాల్ కూడా స్పందిస్తూ, నిజంగా ఇతరులను హృదయపూర్వకంగా ప్రశంసించే వారు చాలా తక్కువమందే ఉంటారని అన్నారు.

అలాగే రణ్‌వీర్ సింగ్ నటనపై కూడా ప్రశంసలు కురిపించారు అనురాగ్ . దురంధర్ 2 షూటింగ్ సమయంలో అతను ఎంత కష్టపడ్డాడో చెప్పిన అనురాగ్, “Lootera” సినిమాలో కూడా పాత్ర కోసం తనను తాను గాయపరుచుకునేంతగా అంకితభావంతో పనిచేశాడని చెప్పారు.

ALso Read:బాధితుల ఫోటోలతో పాక్‌కు ఇరాన్ ప్రతినిధులు

- Advertisement -