‘బిగ్ బాస్’కు రాయ్ లక్ష్మీ..?

228
Rai Lakshmi in big boss 2?
- Advertisement -

‘బిగ్ బాస్’ షో ఇటు తెలుగులో.. అటు తమిళంలో సూపర్ హిట్టయింది. ఈ రెండు భాషల్లో రెండో సీజన్ కోసం సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 25నే సీజన్-2 మొదలైపోతుందట. గత ఏడాది లాగే రెండున్నర నెలల పాటు షో నడుస్తుంది. సీజన్-2కు సంబంధించిన ప్రోమో జూన్ 3న విడుదలవుతుందని సమాచారం. కాగా రెండో సీజన్లో పాల్గొనే పార్టిసిపెంట్లు ఎవరనే విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి.

Rai Lakshmi in big boss 2?

ఈ సీజన్లో పాల్గొనబోయే పార్టిసిపెంట్లు వీళ్లే అంటూ వికటన్ సోషల్ మీడియా పేజీలో కొందరు సెలబ్రిటీ ఫొటోలు పోస్ట్ చేశారు. ఆ జాబితాలో రాయ్ లక్ష్మీ కూడా ఉంది. హాట్ ఇమేజ్ ఉన్న ఆమె ఈ షోలో పాల్గొంటే భలే మజా వస్తుందన్న డిస్కషన్ మొదలైంది. కానీ రాయ్ లక్ష్మీతాను బిగ్ బాస్‌లో పాల్గొనబోవటం లేదని క్లారిటీ ఇచ్చింది.

బిగ్ బాస్ తొలి సీజన్లో కూడా రాయ్ లక్ష్మీ పేరు ఇలాగే ప్రచారంలోకి రాగా.. ఆమె ఖండించింది. ఈసారీ అదే జరిగింది. ఈ క్రమంలో ‘బిగ్ బాస్’పై ఆమె అసహనం ప్రకటించింది. ప్రతిసారీ తన గురించి ఇలా అబద్ధపు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది.

- Advertisement -