సీఎల్పీ సమావేశంలో పార్టీ ప్రజాప్రతినిధులపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరికలు జారీ చేశారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు అన్నారు.
పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది… మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదు అన్నారు.
సీఎం హెచ్చరికలు జారీ చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారు. మంత్రి పదవి విషయంలో నాకు అసంతృప్తి ఉందని… కాంగ్రెస్ లో వి.హనుమంతరావు తర్వాత నేనే సీనియర్ అన్నారు జీవన్ రెడ్డి. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు… ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించడంలో తప్పు లేదు అన్నారు. అయితే.. నేను పార్టీ మారుతానని ఎలా అనుకుంటున్నారు చెప్పాలన్నారు.
Also Read:అబద్దాలతోనే కాంగ్రెస్ పాలన:హరీష్

