కెలకమాకు సామీ..:శాస్త్రీ

424
Rama jogayya sastry tweet on rgv
- Advertisement -

ఎప్పుడూ ఎదో ఒకటి చేస్తూ వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. గతంలో పవన్‌ కల్యాణ్‌కు వర్మకు మధ్య ట్విట్టర్ వేదికగా ఎప్పుడూ పొగిడినట్టే పొగుడుతూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా
తయారైంది. తాజాగా మరో వివాదాస్పదమైన ట్వీట్‌కు తెర తీశాడు వర్మ.

Rama jogayya sastry tweet on rgv

శ్రీరెడ్డి వివాదంలో ఇకపై పవన్‌ కానీ మెగా ఫ్యామిలీ కుటుంబం పైన ఎలాంటి కామెంట్స్ చేయనని మళ్లీ ట్విట్టర్ వార్‌కు తెర తీశాడు. ఇటీవల పవన్ శ్రీవారి దర్శన నిమిత్తం తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. దర్శనంలో భాగంగా పవన్ మెట్ల మీద కుర్చుని సేద తీరుతున్నఫోటో వైరల్ అయింది. ఆ ఫోటోపై వర్మ ఓ ట్వీట్‌ చేసి మళ్లీ వార్తల్లోకొచ్చాడు.

 పవర్ స్టార్ పవర్ ఫుల్ ఎనర్జీకి ఇది నిదర్శనమంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ పట్ల అభిమానుల ఫైర్ అవుతున్నారు. తాజాగా ఇదే అంశంపై పాటల రచయిత రామజోగయ్య శాస్త్రీ స్పందించారు. కెలకమాకు సామీ.. ఏమన్న ఉంటే పర్సనల్‌గా ఫోన్ చేసి మాట్లాడుకోండి. అంటూ ట్వీట్‌ చేశాడు.

- Advertisement -