savarkar:రాహుల్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఉద్ధవ్..!

34
- Advertisement -

సావర్కర్‌ను కించపరిచేలా మాట్లాడిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే గట్టి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో రాహుల్‌గాంధీ సావర్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్ధవ్ హెచ్చరించారు. గతంలో మీడియాతో రాహుల్‌ మాట్లాడుతూ..నాపేరు సావర్కర్ కాదు. గాంధీ..! క్షమాపణలు చెప్పే కుటుంబం కాదని అంటూ వ్యాఖ్యానించారు.

సావర్కర్‌ను కించపరిచేలా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. హిందూత్వ సిద్ధాంతాల విషయంలో సావర్కర్‌ మాకు స్పూర్తి. ఆయన్ని మేము ఆరాధ్యదైవంగా భావిస్తామని ఉద్ధవ్ అన్నారు. సావర్కర్‌ని అవమానిస్తే దానికి తగ్గ చర్యలు తప్పవని హెచ్చరించారు. సావర్కర్ విషయంలో పోరాటం చేయడానికి అయినా మేం సిద్ధమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మేము కాంగ్రెస్ ఎన్సపీతో జత కట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి…

KTR:బీజేపీ..బలాత్కార్ జస్టిఫికేషన్ పార్టీ

tejaswiyadav:తండ్రైన తేజస్వీ యాదవ్..

Janga Raghavareddy:జంగాపై సస్పెన్షన్ వేటు

- Advertisement -