- Advertisement -
ఐపీఎల్ 2020లో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు ఆలౌటైంది. ఓపెనర్ గా వచ్చిన రాహుల్ త్రిపాఠి 81 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 51 బంతులాడిన త్రిపాఠి 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. త్రిపాఠి తర్వాత కోల్ కతా ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు సాధించింది బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ మాత్రమే. కమిన్స్ 9 బంతుల్లో 17 పరుగులు చేసి అజేయంగా మిగిలాడు.
మిగిలిన బ్యాట్స్ మెన్ ఎవ్వరూ రాణించకపోవడంతో కోల్ కతా భారీస్కోరు ఆశలు నెరవేరలేదు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం, ఫీల్డర్లు సమర్థంగా వ్యవహరించడంతో కోల్ కతా గౌరవప్రదమైన స్కోరుతో సరిపెట్టుకుంది. చెన్నై బౌలర్లలో శామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, కర్ణ్ శర్మ, డ్వేన్ బ్రావో తలో రెండు వికెట్లు తీశారు.
- Advertisement -