రాహుల్‌ సలహాకి …ఫైరైన బీజేపీ

210
- Advertisement -

కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్రా దిగ్విజయంగా కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు కొనసాగే ఈ యాత్ర …ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతుంది. అగర్‌-మాల్వాలో శుక్రవారం రాత్రి జరిగిన ఒక బహిరంగ సభలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి.

రాహుల్‌ మాట్లాడుతూ… జై సియారామ్‌ అంటే ఏంటి? జై సీత, జై రామ్‌. సీత, రాముడు ఒక్కటే. అందుకే జై సియారామ్‌ లేదా జై సీతారామ్‌ అనాలి. రాముడు సీత గౌరవం కోసం పోరాడాడు. సమాజంలో సీతలాంటి స్త్రీలను జయ సియారామ్‌ అని పిలువాలి. జై శ్రీరామ్‌ అంటే ఇందులో రాముడికొక్కడికే నమస్కారం చెప్తున్నట్లుగా ఉంటుంది. సమాజాన్ని ఏకం చేసే పనిని రాముడు చేపట్టాడు. రాముడు అందరికీ గౌరవం ఇచ్చాడు.

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ వాళ్లు రాముడి జీవన విధానాన్ని ఏమాత్రం అనుసరించడం లేదు. వారి సంస్థలో సీత లేనందున వారు సియారామ్‌ అని, హే రామ్‌ అని అనరు. సీతను బయటకు విసిరేశారు. హే రామ్‌ అంటే రాముడి జీవన విధానం. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లకు నిజంగా శ్రీరాముడిపై భక్తి ఉంటే జై శ్రీరామ్‌కు బదులుగా జై సితారామ్‌ అనగలరా? అని రాహుల్‌ ప్రశ్నించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

షాన్‌వాజ్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ…రాహుల్‌ సర్టిపికేట్‌ ఏదీ బీజేపీకి అక్కర్లేదని అన్నారు. రాహుల్‌ కాంగ్రెస్‌ నేతలు ఎన్నికైన హిందువులని విమర్శించారు.

బ్రజేష్‌ పాఠక్‌ స్పందిస్తూ.. రాహుల్‌ ఓ డ్రామా ట్రూప్‌కు నాయకుడు మాత్రమేనన్నారు. ఆయనకు భారతీయ సంస్కృతి గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఓ వీధి నుంచి మరో వీధికి పరిగెత్తడం మాత్రమే రాహుల్‌కు తెలుసునన్నారు.

మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తం మిశ్రా మాట్లాడుతూ… జోడో యాత్రలో విరామం దొరక్కగానే భారతదేశ చరిత్ర సంస్కృతి పుస్తకాలు చదవాలని సలహా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి…

పాదయాత్రలు కాదు..రిలే యాత్రలు!

దివ్యాంగులకు అండగా టీఎస్ సర్కార్..

బీ-21… ఆరోతరం యుద్ధ విమానం

- Advertisement -