కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసా,కామారెడ్డిలో ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో పాల్గొని మాట్లాడనున్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు భైంసా చేరుకుంటారు.
12.30 నుంచి 1.30 గంటల వరకు భైంసా సభలో పాల్గొననున్న రాహుల్ అనంతరం కామారెడ్డి చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటలకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు.
రాహుల్‌తో పాటు సోనియా గాంధీని ప్రచారానికి రప్పించే ఆలోచనలో ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. రాహుల్‌తో పది సభలను ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్…సోనియాను కూడా వీలైనంత ఎక్కువ సభలకు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎన్నికల ప్రకటన తర్వాత రాహుల్ పాల్గొంటున్న సభ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.