తెలంగాణకు రాహుల్ గాంధీ..!

151
rahul
- Advertisement -

త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఇప్పటికే వరుస సభలతో దూకుడుమీదున్న కాంగ్రెస్…తర్వాత నిర్వహించబోయే సభకు రాహుల్‌ హాజరయ్యేలా ప్లాన్ చేస్తోంది. ఈ సభ సెప్టెంబర్ రెండో వారంలో ఉండనున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.

రాహుల్ గాంధీ కేటాయించే సమయాన్ని భట్టి వరంగల్‌లో లేదా మహబూబాబాద్‌లో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు హస్తం నేతలు. ఇక దేశంలో మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ చర్యలను వేగవంతం చేసింది.

ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా సారథ్యంలో 15 పార్టీలకు చెందిన నేతలతో వర్చువల్‌గా సమావేశం జరగనుంది. ఈ భేటీలో.. ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించనున్నారు. వచ్చే ఏడాదిలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించే అవకాశముంది.

- Advertisement -