Rahul:ప్రతి పేద కుటుంబానికి లక్ష సాయం

20
- Advertisement -

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానిక లక్ష సాయం అందిస్తానని తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు రాహుల్.

రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ కావాలో.. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటున్న బీజేపీ-ఆర్ఎస్ఎస్ కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు.తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తున్నామని రాహుల్ చెప్పారు.

ఢిల్లీలో ఈసారి ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. జాతీయ ఉపాధిహామీ కూలీ 400కు పెంచుతాం అన్నారు. దేశంలో ఉన్న 90శాతం పేదల తలరాతలు మారుస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. రిజర్వేషన్లు 50శాతం దాటాలి. అధికారంలోకి రాగానే 50శాతం నిబంధన ఎత్తేస్తాం అన్నారు. దేశంలో ధనికుల ప్రభుత్వం నడుస్తుంది… దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డారు.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో నూతన వధువరులు..

- Advertisement -