బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాన‌వ‌త్వం లేదు!

51
rahul

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మానవత్వం లేదని…ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న పట్టించుకోవడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఆగ్రాలోని ఓ ప్రైవేట్ ద‌వాఖాన‌లో 22 మంది రోగులు మ‌ర‌ణించగా స్పందించిన రాహుల్… రోగుల మ‌ర‌ణాల‌కు బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతే కాదు మానవత్వం లేకుండా పోయిందన్నారు.

ఆగ్రాలోని పార‌స్ ద‌వాఖాన‌లో కొవిడ్-19 రోగుల మ‌ర‌ణంపై యూపీ సర్కార్ విచారణ చేపట్టిందన్నారు. ద‌ర్యాప్తు పూర్త‌యిన అనంత‌రం రోగుల మ‌ర‌ణానికి కార‌ణం ఏమిట‌నేది వెల్ల‌డ‌వుతుంద‌న్నారు.