టీకాలపై ప్రజలను చైతనపరచండి..

22
venkaiah

దేశంలో కరోనా కట్టడికి టీకాల పంపిణీ ఒక్కటే మార్గమని…దీనిపై ప్రజలను చైతన్య పరచాలన్నారు ఉప రాష్ట్రపతి,రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. నలుగురు ఎంపీలు ఇవాళ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్ర‌జాజీవితంలో ఉండే మ‌న స‌భ్యులంతా అత్యున్న‌త ప్ర‌మాణాలు పాటించాల‌న్నారు. రీనామినేట్ అయిన స‌భ్యులకు స‌భా వ్య‌వ‌హారాలు తెలుసు అని, కొత్త‌గా నామినేట్ అయిన వారు రాజ్య‌స‌భ పుస్త‌కాల‌ను, రూల్ బుక్స్‌, ప‌బ్లికేష‌న్స్‌ను ఓ సారి చ‌ద‌వాల‌న్నారు.

పార్ల‌మెంట‌రీ క‌మిటీల్లో స‌భ్యుత్వం ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని, స్థానిక నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను వ్యాక్సిన్ తీసుకునేలా చైత‌న్య‌ప‌రుచాల‌ని ఆయ‌న స‌భ్యుల‌కు సూచించారు. కేర‌ళకు చెందిన జ‌ర్న‌లిస్టు జాన్ బ్రిటాస్‌, సీపీఎం నేత వీ శివ‌దాస‌న్‌, సీనియ‌ర్ అడ్వ‌కేట్ మ‌హేశ్ జెఠ్మ‌లానీ, బీజేపీ నేత స్వ‌ప‌న్ దాస్‌గుప్తాలు రాజ్య‌స‌భ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయగా నూత‌న స‌భ్యుల‌కు వెంకయ్య శుభాకాంక్షలు తెలిపారు.