ఎంపీ నవనీత్‌ కౌర్‌కు షాక్‌..ఎంపీ పదవికి ఎసరు‌!

43
navneet

సినీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు షాక్ తగిలింది. ఎస్సీ కాకుండానే ఎస్సీ సర్టిఫికేట్‌తో గెలిచిందని ఆమె కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది బాంబే హైకోర్టు. దీంతోపాటు రూ.2 లక్షల జరిమానా విధించింది.నవనీత్ కౌర్ పేక్ సర్టిఫికేట్‌తో గెలిచిందని శివసేన నేత ఆనందరావు పిటిషన్ దాఖలు చేయగా దీనిపై ఉత్తర్వులు వెలువరించింది.

మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ్ లోక్‌సభ స్థానం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్ కౌర్ విజయం సాధించారు. బాంబే హైకోర్టు తీర్పుతో ఆమె పార్లమెంట్ సభ్యత్వానికి ముప్పు ఏర్పడింది.