కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మతపరమైన ఘర్షణలు నిత్యం ఏదో ఒక చోట దర్శనమిస్తూనే ఉన్నాయి. హిజాబ్ విజయమైతేనిమీ, మణిపుర్ అల్లర్ల విషయమైతేనేమీ ఇలా నిత్యం ఏదో ఒక చోట వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ మద్య మణిపూర్ లో జరుగుతున్నా సంఘటనలు దేశం మొత్తాన్ని ఏ స్థాయిలో కలచివేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మణిపూర్ ఘర్షణల విషయంలో ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో మోడి సర్కార్ పై నిత్యం విమర్శలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ మరియు ఆ పార్టీ అనుబంధ సంస్థ ఆర్ ఎస్ ఎస్ లను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
'भारत जोड़ो यात्रा' में एक नारा सामने आया- नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है।
जहां भी ये (BJP) नफरत फैलाएं, आप जाकर वहां मोहब्बत की दुकान खोलिए।
: @IYC के कार्यक्रम को संबोधित करते हुए @RahulGandhi जी pic.twitter.com/vIz2SdZfvG
— Congress (@INCIndia) July 27, 2023
” బీజేపీ వారికి అధికార దాహం తప్పా ప్రజా సంక్షేమం అవసరం లేదని.. వారు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని, ఏమైనా చేసేందుకు సిద్దపడతారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒకవైపు మణిపూర్ తగలబడుతున్నా మోడి ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు ఉండడం దేనిని సూచిస్తుందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. దేశంలో ఎవరికి బాధ కలిగిన ప్రతిఒక్కరం బాధ పడతామని ఎందుకంటే మనమంతా ఒక్కటే అని భావిస్తామని చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశాన్ని విభజించే ధోరణిలో ఉన్నారని ఆయన ఘటన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నిజమేనేమో అనే సందేహం రాకమానదు. రాజకీయ అతివాదులు కూడా రాహుల్ వ్యాఖ్యాలను సమర్తిస్తున్నారు. మరి ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న మతపరమైన సమస్యల కారణంగా ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.
Also Read:ఆగస్టు 3 నుండి అసెంబ్లీ సమావేశాలు…