- Advertisement -
ఎన్నికల సంఘంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్ చేశారు. దేశంలో ఎన్నికల సంఘం రాజీ పడిందని.. ఇటీవలే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ బోస్టన్ ప్రవాస భారతీయ ఉద్దేశించి ప్రసంగించారు.
సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘమే స్వయంగా ప్రకటించింది. అంత తక్కువ సమయంలో అంతమంది ఎలా ఓటు వేస్తారు చెప్పాలని ప్రశ్నించారు రాహుల్. వీడియోలు చూపించాలని అడిగాం… అందుకు ఈసీ తిరస్కరించిందన్నారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లారు రాహుల్. ఎన్నారై సంఘాలు, ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులతో రాహుల్ సమావేశం కానున్నారు.
Also Read:గ్రేటర్‌లో 3 రోజులు వైన్స్ బంద్
- Advertisement -

