హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఆదేశించారు పోలీసులు. దీంతో గ్రేటర్ పరిధిలో మూడు రోజుల పాటు వైన్స్ బంద్ కానున్నాయి.
ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా ఏప్రిల్ 25న కౌంటింగ్ జరగనుంది. మే 1 2025 వరకు ఎమ్మెల్సీ ఎం ఎస్ ప్రభాకర్ పదవి కాలం ఉంది. ఈ ఎన్నికల్లో మజ్లిస్, ఎంఐఎం రేసులో ఉండగా ఎంఐఎం పార్టీ బలం – 49 (1 ఎంపీ, 7 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 40 మంది కార్పొరేటర్లు), బీఆర్ఎస్ పార్టీ బలం – 25 (3 రాజ్యసభ ఎంపీలు, 2 ఎమ్మె ల్సీలు, 5 ఎమ్మెల్యేలు, 15 మంది కార్పొరేటర్లు), బీజేపీ పార్టీ బలం – 19 (1 ఎంపీ, 1 ఎమ్మెల్సీ, 19 మంది కార్పొరేటర్లు) ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలం – 14 (1 రాజ్యసభ ఎంపీ, 4 ఎమ్మె ల్సీలు, 2 ఎమ్మెల్యేలు, 7 కార్పొరేటర్లు), ఎంఐఎంకి మద్దతిస్తోంది. ఇక బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉండటమే కాదు ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని తెలిపారు కేటీఆర్.
Also Read:జపాన్‌లో సీఎం రేవంత్ బృందం బిజీ

