కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రాహుల్ ట్వీట్..

231
Rahul Gandhi Say To BJP Government Is defeat of democracy
- Advertisement -

కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మౌనంగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీని విమర్శించారు. ‘బీజేపీ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన సంఖ్యా బలం లేకున్నా.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పట్టుబట్టిందని, ఇలా చేయడం రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు. బీజేపీ అడ్డదారి విజయంతో సంబరాలు చేసుకుంటుంటే.. ఓడిపోతున్న ప్రజాస్వామ్యాన్ని చూసి దేశం విచారిస్తోంది అని రాహుల్ ట్వీట్ చేశారు.

మరోవైపు యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి వ్యతిరేకంగా.. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమితో తమకు ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యా బలం ఉన్నప్పటికి.. గవర్నర్ బీజేపీని ఆహ్వానించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. బలనిరూపణకు గవర్నర్ యడ్యూరప్పకు 15 రోజుల గడువు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. ఈ ఎన్నికల ఫలితాలలో బీజేపీకి 104, కాంగ్రెస్ కు 78, జేడీఎస్ కు 38 సీట్లు వచ్చాయి.

Rahul Gandhi Say To BJP Government Is defeat of democracy

కర్ణాటక గవర్నర్ వాజుభాయి నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రముఖ న్యాయనిపుణుడు రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక గవర్నర్ నిర్ణయాన్ని వ్యక్తిగత హోదాలో ఆయన సవాల్ చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని నిరసిస్తూ నిన్న రాత్రే కాంగ్రెస్ సుప్రీంకోర్టు తలుపు తట్టగా, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో తమ తుది ఆదేశాలకు లోబడి ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణస్వీకారం ఉంటాయని స్పష్టం చేసింది.

- Advertisement -