Congress:కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా రాహుల్

7
- Advertisement -

కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశామని వెల్లడించారు ఆపార్టీ నేత కేసీ వేణుగోపాల్. ఇండియా కూటమి భేటీలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై చర్చించామని తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం కల్పించిన ఇబ్బందులపై చర్చించామని…. కేంద్ర దర్యాప్తు సంస్థలతో తమ నేతలను బ్లాక్ మెయిల్ చేశారని చెప్పారు.కాంగ్రెస్ పని అయిపోయిందని చాలామంది అన్నారని తెలిపారు.ఇండియా కూటమి ఎజెండాను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని చెప్పారు.

ఓట్లేసిన ప్రజలకు కాంగ్రెస్ అభినందనలు తెలిపిందని… రాహుల్ గాంధీ చేసిన రెండు యాత్రలు తమ పార్టీకి అన్ని సీట్లు రావడానికి కలిసి వచ్చాయని చెప్పారు. తమతో కలిసి వచ్చిన కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read:హాయిగా నిద్ర పోవడానికి..!

- Advertisement -