కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్దమౌతున్నారా ? ఎన్నికల ముందు నిత్యం ప్రజల్లో ఉండేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారా ? అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర హస్తం పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగిన ఈ యాత్రతో కాంగ్రెస్ రాష్ట్రాల భారీగా బలం పెంచుకుంది. గతంలో రాహుల్ గాంధీపై వచ్చిన ఎన్నో విమర్శలకు జోడో యాత్రతో చెక్ పెట్టారు. దీంతో గ్రాండ్ గా సక్సెస్ జోడో యాత్రను మళ్ళీ మొదలు పెట్టాలని ఈసారి పశ్చిమం నుంచి తూర్పుకు యాత్ర ఉండనుందని గతంలో వార్తలు గట్టిగా వినిపించాయి. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా రాహుల్ జోడో యాత్ర 2.0 కు ప్లాన్ చేస్తూ వచ్చింది. .
అయితే ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో అన్ని రాష్ట్రాలను జోడో యాత్రలో కవర్ చేయడం కష్టమని భావించిన కాంగ్రెస్.. జోడో యాత్ర కాకుండా మరో విధంగా యాత్ర చేపట్టే ప్లాన్ చేస్తున్నారట రాహుల్ గాంధీ. ఈసారి భారత్ న్యాయ యాత్ర పేరుతో యాత్ర చేపట్టేందుకు సిద్దమౌతున్నారట. మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర, ఆ తర్వాత పాదయాత్ర రూపంలో ఈ యాత్ర సాగానున్నట్లు సమాచారం.
జనవరి 14 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు వినికిడి.. జనవరి 14 నుంచి మొదలు పెట్టి మార్చి 20 వరకు నాగాలాండ్, మేఘాలయ, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్,.. వంటి రాష్ట్రాల్లో ఈ యాత్ర కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక మార్చి చివర్లో లేదా ఏప్రెల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈలోగా వీలైనన్ని రాష్ట్రాల్లో యాత్ర కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి జోడో యాత్రతో పార్టీకి మంచి మైలేజ్ తెచ్చిన రాహుల్ గాంధీకి రెండో సారి చేపడుతున్న ఈ యాత్ర ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.
Also Read:షాక్.. కరోనా కేసులు భారీగా పెరిగే ఛాన్స్..!