యువత భవిష్యత్తును నాశనం చేశారు!

2
- Advertisement -

నీట్ పేపర్ లీక్ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. దేశ యువత భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వమే నాశనం చేస్తోందని ఆరోపించారు. యువత సంక్షేమం, భవిష్యత్తు ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేస్తూ.. నిందితులకు శిక్ష పడేలా కేంద్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించిన కొద్దిసేపటికే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. విద్యా వ్యవస్థను పూర్తిగా హస్తగతం చేసుకుని, నాశనం చేశారని దానికి బాధ్యులైన వారిని ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు.

మన యువత భవిష్యత్తును అత్యంత దారుణంగా దెబ్బతీసింది మీరే. మన విద్యా వ్యవస్థను పూర్తిగా కొందరి చేతుల్లోకి వెళ్లేలా, ధ్వంసమయ్యేలా మీరు ప్రోత్సహించారు అంతేకాకుండా దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ కాపాడారు అని రాహుల్ గాంధీ విమర్శించారు.

విద్యార్థుల డిమాండ్లను ప్రస్తావిస్తూ ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలి…విద్యార్థులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.

Also Read:పేపర్ లీక్‌లపై మోదీ సంచలనం

నీట్ పేపర్ లీక్‌పై యువత ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో, పేపర్ లీక్‌లకు పాల్పడే వారికి త్వరితగతిన, కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపిన సంగతి తెలిసిందే.

- Advertisement -