Raghubar Das:ఉద్యోగి నుండి సీఎం వరకు

42
- Advertisement -

రఘుబర్ దాస్.. జార్ఖాండ్ మాజీ సీఎం. టాటా స్టీల్ ప్లాంట్ ఉద్యోగి నుండి సీఎం వరకు ఎదగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రఘుబర్..ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 1955 మే 3న జన్మించారు. ఆయన తండ్రి స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగి. తేలి సామాజిక వర్గానికి చెందిన రఘువర్..జయప్రకాశ్ నారాయణ్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు.

1980లో బీజేపీలో చేరిన ఆయన జంషేడ్‌పూర్‌ సిటీ సహాయ కార్యదర్శిగా,ఉపాధ్యక్షుడిగా,బీజేపీ కార్యదర్శిగా పనిచేశారు. జంషెడ్ పూర్ ఈస్ట్ నుండి 1995లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన తర్వాత వరుసగా ఐదుసార్లు ఆ స్ధానం నుండి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు.

Also Read:ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం..

28 డిసెంబర్ 2014 నుంచి 28 డిసెంబర్ 2019 వరకు పూర్తి ఐదేళ్లపాటు జార్ఖండ్ ఆరవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత 2019 డిసెంబర్ 29న హేమంత్ సోరెన్ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు.

Also Read:Asthama:ప్రపంచ ఆస్తమా దినోత్సవం

- Advertisement -