టీటీడీ చైర్మన్‌గా తాను బాధ్యతలు చేపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని దర్శకుడు కే. రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఎస్వీఎస్సీ ఛానెల్ ద్వారా స్వామివారికి సేవ చేస్తున్నాను. శ్రీవారికి చెందిన కార్యక్రమాలను మరింత వైవిధ్యంగా రూపొందించి భక్త జనకోటిని అలరిస్తూ ఆయన సేవలో తరించాలన్నది నా కోరిక. అని దర్శకేంద్రుడు ట్వీట్ చేశారు.
టీటీడీ ఛైర్మన్‌గా రాఘవేంద్రరావు బాధ్యతలు చేపడుతున్నట్లు గత రెండు, మూడు రోజులుగా కొన్ని పత్రికలు, సోషల్‌మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. నేను టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడుతున్నానని వార్తలు వస్తుండడంతో వేలాది మంది అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించాల్సి వచ్చిందని తెలిపారు.
రాఘవేంద్రరావు వెంకటేశ్వరస్వామి నేపథ్యంలో ‘అన్నమయ్య’, ‘నమో వేంకటేశాయ’ చిత్రాలు తెరకెక్కించిన విషయం విదితమే. ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్నారు రాఘవేంద్రరావు.