రాధికా ఆప్టే …రివేంజ్ థ్రిల్లర్ ‘అక్క’

52
- Advertisement -

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్. మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది. సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ జోనర్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తోన్న వెర్సటైల్ యాక్టర్స్ కీర్తి సురేష్, రాధికా ఆప్టే ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

‘‘మన చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్, రాధికా ఆప్టే వంటి నటీమణులు ఉండటం అనేది మనకు ఓ బహుమానంగా చెప్పొచ్చు. వారు సహజ సిద్ధమైన నటనతో మెప్పిస్తారు. వారి అద్భుతమైన నటనతో ప్రశంసలను పొంది తద్వారా తమదైన క్రేజ్‌ను వారు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. పోటా పోటీగా నటించే వీరిద్దరూ కలిసి ‘అక్క’ అనే స్ట్రీమింగ్ ప్రాజెక్ట్‌తో అలరించబోతున్నారు. ఇదే ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది’’ అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఆదిత్య చోప్రా నిర్మాతగా ధర్మరాజ్ శెట్టి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారు. ‘అక్క’ ప్రాజెక్ట్‌పై డైరెక్టర్ విజన్‌ని గుర్తించిన ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో ‘అక్క’ సిరీస్‌ను వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సీక్రెట్‌గానే ఉంచుతున్నారంటూ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

రీసెంట్‌గా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్‌ను వైఆర్‌ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ తమ మొదటి వెబ్ సిరీస్‌గా రూపొందించింది. ఇందులో ఆర్.మాధవన్, కె.కె.మీనన్, దివ్యేందు శర్మ, బాబిల్ ఖాన్ తదితరులు నటించారు. 1984 భోఫాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించి రిలీజ్ చేయగా వరల్డ్ వైడ్ టాప్ టెన్ వెబ్ సిరీస్‌ల్లో ఒకటిగా నెట్‌ఫ్లిక్స్‌లో ఇది ట్రెండ్ అవుతుంది.

అలాగే వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన సెకండ్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఇది మల్టీ సీజన్ సిరీస్. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌లో వాణీ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. ట్రాన్స్‌జెండర్ పాత్రలో ఆమె నటనకు చాలా మంచి ప్రశంసలు దక్కాయి. ఇదే ఆమె తొలి డిజిటల్ ఎంట్రీ. వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా, జమీల్ ఖాన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఇప్పుడు చిత్రీకరణను జరుపుకుంటోంది.

మన ఆడియెన్స్ కోసం వైవిధ్యమైన కంటెంట్‌ను రూపొందించటానికి వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ భారీ స్థాయిలో రూపొందించటానికి సిద్దంగా ఉంది. మన కంటెంట్‌ను గ్లోబల్ రేంజ్ ఆడియెన్స్‌కు దగ్గర కావటంలో వైఆర్ఎఫ్ కీలక భూమికను పోషిస్తోంది. ది రైల్వే మెన్ సక్సెస్ అనేది ఈ సంస్థకు ఓ రన్ వేలా మారిందని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ‘ది రైల్వే మెన్’ను చూసిన వారందరూ అభినందిస్తున్నారు. సమీక్షలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. మౌత్ టాక్‌తో ఇది ప్రేక్షకులకు మరింత చేరువైందని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

Also Read:డబుల్ ఇస్మార్ట్‌లో మణిశర్మ ఆన్ బోర్డ్

- Advertisement -