తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉన్న బీజేపీకి సొంత పార్టీ నేతల నుంచే చిక్కులు ఎదురవుతున్నాయి. దాంతో పార్టీ అధిష్టానం ఏం చేయాలో తెలియక తలపట్టుకుతోంది. ముఖ్యంగా పార్టీ చీఫ్ బండి సంజయ్ మరియు చేరికల కమిటీ చైర్మెన్ ఈటెల రాజేందర్ మద్య మారుతోన్న రాజకీయ సమీకరణలు ఆ పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. దాంతో ఈటెల వర్సస్ బండి అనే చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎన్నికైన తరువాత ఆ పార్టీకి బాగానే మైలేజ్ తీసుకొచ్చారు. పార్టీ అధిష్టానం కూడా బీజేపీని అధికారంలొకి తీసుకొచ్చే భాద్యతను బండి సంజయ్ కే అప్పగించింది.
దీంతో ఆయన పాదయాత్రలు చేస్తూ తన వంతుగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. అయితే ప్రజలు బిఆర్‌ఎస్ పక్షాన ఉండడంతో కమలం పార్టీకి ఆశించిన స్థాయిలో ఆధారణ లభించడం లేదు. దీంతో బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆ భాద్యతను ఈటెల కు అప్పగించే అవకాశం ఉందని ఆ మద్య వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల ముందు ఇలాంటి మార్పులు చేసే సాహసం అధిస్థానం చేస్తుందా అనేది ప్రశ్నార్థకమే. కానీ ఈ మద్య బండి సంజయ్ ని కాదని ఈటెల రాజేందర్ కే అధిష్టానం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మద్య తరచూ ఈటెల కు డిల్లీ నుంచి పిలుపులు వస్తుండడంతో అసలు విషయం ఏమైఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంచితే గత కొన్ని రోజులుగా సీట్ల పంపకాల విషయంలో బీజేపీ అధిస్థానం తర్జన భర్జన పడుతోందట.
ముఖ్యంగా వేములవాడ సీటు విషయంలో రచ్చ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో వేములవాడ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు బండి సంజయ్ ఆసక్తి చూపిస్తున్నారట. అయితే ఈ సీటు పై ఈటెల రాజేందర్ మరియు మాజీ జెడ్‌పిటిసి తుల ఉమా కూడా గట్టిగానే గురి పెట్టారు. అయితే ఈ సీటు విషయంలో మొదటి నుంచి కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈటెల.. అధిష్టానం కూడా ఈటెల వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బండి సంజయ్ ని రెండు సార్లు ఓడిపోయిన కరీంనగర్ నుంచి మళ్ళీ బరిలోకి దింపాలని అధిష్టానం ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అటూ అధ్యక్ష రేస్ లోనూ ఇటు సీట్ల విషయంలోనూ బండి సంజయ్ వర్సస్ ఈటెల రాజేందర్ మద్య జరుగుతోన్న రాజకీయం హాట్ హాట్ డిబేట్ లకు కారణం అవుతోంది.
ఇవి కూడా చదవండి…