‘పుష్ప 2’ పై కొత్త కసరత్తులు

35
- Advertisement -

అల్లు అర్జున్ – సుకుమార్ సినిమా అప్ డేట్ తెలియక ఫ్యాన్స్ కిందా మీదా అయిపోతున్నారు. కథలో కొత్త మార్పులు అంటూ కొన్ని వార్తలు వినిపించాయి. మరీ ఇప్పుడు కథలో మార్పులు ఏమిటీ అదీ సీక్వెల్ సినిమాకి, పైగా బన్నీ సినిమాకు అంటూ కౌంటర్లు కూడా వినిపించాయి. ఇలా రకరకాల కామెంట్లు, ట్విట్టర్ లో అభిమానుల వేడుకోళ్లు అన్నీ వినిపిస్తున్నా.. సుకుమార్ వైపు నుంచి చలనం కూడా లేదు. షూట్ చేస్తున్నా.. చాలా స్లోగా సాగుతుంది. ఒక షెడ్యూల్ కి మరో షెడ్యూల్ కి చాలా గ్యాప్ ఉంటుంది.

పాన్ ఇండియా సినిమా అనుకుని మొదట కథ అల్లుకున్నారు. కానీ, ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు. జపాన్ లో కూడా భారీ స్థాయిలో పుష్ప 2 చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనేది బన్నీ – సుకుమార్ ప్లాన్. ఆ ప్లాన్ కి తగ్గట్టు సుకుమార్ స్క్రిప్ట్ లో మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. తన టీమ్ తో స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే షూట్ కొంత స్లోగా సాగుతుంది.

ఎంతైనా సుకుమార్ కథ తయారు చేసుకోవడం అంటే తపస్సులోకి వెళ్లినట్లే. ఆయన తన టీమ్ తో కూర్చుని స్క్రిప్ట్ ఫైనల్ చేసుకున్న తర్వాత కూడా సుకుమార్ ఒంటరిగా రోజుల తరబడి వుంటూ కథలో బెటర్ మెంట్స్ కోసం కష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం సుకుమార్ అదే పని మీద వున్నట్లు తెలుస్తోంది. నిజానికి హీరోలు దర్శకులందరికీ ఇప్పుడు కథలే సమస్య. అవి అద్భుతంగా ఉండాలి. అప్పుడే వారి మనసు సంతృప్తి పడుతుంది.

ఇవి కూడా చదవండి…

సూర్య , చరణ్ కాంబో సెట్ ?

ఐదు రోజుల్లో 500 కోట్లు.. గ్రేట్

ఈ వారం ఓటీటీ కంటెంట్ ఇదే

- Advertisement -