రేస్3 చెత్త రికార్డ్.. దబాంగ్3 వద్దు..

234
dabangg3
- Advertisement -

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన రేస్3 మూవీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. బాలీవుడ్ లో చెత్త సినిమాల లిస్ట్ లో ఈ సినిమా చేరిపోయింది. అయితే కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించినా.. ప్రేక్షకులలో మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు సైతం నెగిటివ్ గా వచ్చాయి. హిందీ చెత్త సినిమాలలో రేస్3 ఒకటి అని ఐఎండీబీ తేల్చేసింది. కేవలం 2.6 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఇప్పటివరకు హిందీలో అన్నింటి కంటే చెత్త సినిమాగా రాంగోపాల్ వర్మ కీ ఆగ్(1.9) గా ఉంది.

Salman-Khan-

మరోవైపు సల్మాన్ దబాంగ్ కి సీక్వెల్ గా దబాంగ్3కి సిద్దం అవుతున్నారు. అయితే ఈ సినిమా చేయవద్దని సల్మాన్ కు అభిమానులు సూచిస్తారు. సల్మాన్ నటించిన దబాంగ్1 పెద్ద హిట్. దబాంగ్ సీక్వెల్ గా వచ్చిన దబాంగ్2 యావరేజ్ గా ఉంది. ఇక దబాంగ్3 కి సల్మాన్ సిద్దం కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రేస్3 చెత్త రికార్డు నమోదు చేసిందని.. ఈ క్రమంలో దబాంగ్3 వద్దంటూ.. సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఈ సినిమా చేయవద్దని అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు.

అయినా సల్మాన్ తో చేయడానికి భన్సాలీ వంటి పెద్ద దర్శకులు ఎదురుచూస్తుంటే, చిన్న డైరెక్టర్ లతో సినిమాలు చేసి, ప్లాఫ్ లు ఎందుకు తెచ్చుకోవడం అంటూ నిలదీస్తున్నారట. ఈ మధ్య సల్మాన్ చేస్తున్న సినిమాలలో నాణ్యత లేదని.. సినిమా కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారట. దబాంగ్3 విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిమానులు కోరుతున్నారట. మరి అభిమానుల కోరిక మేరకు, సల్మాన్ ఈ సినిమా ఆపేస్తాడా..? లేదా చూడాలి ఇక.

- Advertisement -