రాగి జావా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే సంగతి తెలిసిందే. ఇందులో మన శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే ప్రతి రోజూ రాగి జావ తాగాలని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే రోజులో రాగి జావా ఏ టైమ్ లో తాగాలనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు తాగడం వల్ల అందులోని పోషకాలను శరీరం గ్రహించలేదని చెబుతున్నారు కొందరు నిపుణులు. ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం పూట రాగి జావ తాగడం మంచిదట. ఉదయం పరగడుపున రాగి జావ తాగితే ఇందులోని థయామిన్, రిబోప్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయట. .
రాగి జావలో విటమిన్ సి, ఇ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి మూలకాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఉదయం పూట రాగి జావ తాగి రోజువారీ దినచర్యను మొదలు పెడితే ఫుల్ యాక్టివ్ గా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాగి జావాలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కండరాలు బలంగా తయారవుతాయి. ఇంకా ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఉదయం పూట రాగి జావా తగిన తర్వాత ఆహారం తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది.
ఇక సాయంత్రం పూట కూడా రాగి జావ తాగడం మంచిదేనట. ఇలా తాగడం వల్ల నిద్ర లేమి సమస్య దురమౌతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా మానసిక ఒత్తిడిని దూరం చేసి మనసుకు ప్రశాంతతను దూరం చేస్తుంది. అంతే కాకుండా ప్రతి రోజూ రాగి జావ తాగితే మధుమేహం కూడా అదుపులో ఉంటుందట. ఇంకా రక్తహీనతను దూరం చేసి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఇలా రాగి జావ ప్రతి రోజూ తాగడం వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి సమయానుసారం రాగి జావ తాగితే అందులోని ప్రయోజనాలను సమృద్దిగా పొందవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Also Read:Bhumana:హిందూ ధర్మంలోకి ఇతర మతస్తులకు స్వాగతం