బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌:కృష్ణయ్య

15
- Advertisement -

తెలంగాణ ఉద్యమ తరహాలో బిసి ఉద్యమం రాబోతుంది అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ బిసి లను అనగదోక్కే ప్రయత్నం చేస్తోంది…మరో సారి బిసి లను మోసం చేస్తుంది అని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి బిసి లంటే చిన్న చూపు అయింది… ఇందులో భాగంగా 18 వ తేదీన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం… ఈ ఉద్యమానికి అన్ని వర్గాల నుండి మద్దతు వస్తుంది…కామారెడ్డి లో బిసి లకు చెప్పింది ఏంది… ఇప్పుడు చేస్తుంది ఏంటి…మేనిఫెస్టోలో బిసిలకు అనేక అంశాలను పొందపరిచి ఇప్పుడేమో మొండి చేయి చూపిస్తుంది అన్నారు.

విద్యానగర్ లోని బిసి భవన్ లో కాంగ్రెస్ సర్కార్ పై ఆర్.కృష్ణయ్య ధ్వజమెత్తారు… రిజర్వేషన్ల అమలు సరిగ్గా చేయనందుకు నిరసనగా బిసి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో కార్ ర్యాలీ నిర్వహించారు…ఈ ర్యాలీని జెండా ఊపి ఆర్.కృష్ణయ్య ప్రారంభించారు… కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటు నినాదాలతో ఈ కార్ ర్యాలీ ముందుకు కొనసాగింది…బిసిలకు విద్యా, ఉద్యోగ , అవకాశాలలో కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బిసి సంఘాల నాయకులు గుజ్జ సత్యం , రాజు నేత , మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Also Read:Lokesh:ఆంధ్రా వంటకాలు ఘాటు ఎక్కువ

- Advertisement -