CSK లేదా KKR..పాండ్యా ఎంట్రీ!

2
- Advertisement -

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ (MI) ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై అనేక వార్తలు, పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో.. భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్‌కింగ్స్ (CSK) లేదా కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) లోకి కాకుండా తిరిగి తన పాత జట్టు అయిన గుజరాత్ టైటాన్స్ (GT) కే వెళ్లే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో హార్దిక్ వేరే జట్టుకు మారే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల హార్దిక్ గుజరాత్ టైటాన్స్ నిర్వాహకులను సంప్రదించారని, అయితే మళ్లీ కెప్టెన్సీ ఇస్తేనే వస్తాననే షరతు పెట్టడం వల్ల ఆ చర్చలు తాత్కాలికంగా ఆగిపోయాయని నివేదికలు వచ్చాయి.

అయితే కెప్టెన్సీ లేకపోయినా హార్దిక్ తిరిగి గుజరాత్ టైటాన్స్‌కే వెళ్లవచ్చని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు. హార్దిక్ గుజరాత్ టైటాన్స్‌ను సంప్రదించడంలో తప్పేమీ లేదు. ఆయన అక్కడ గడిపిన సమయాన్ని బాగా ఆస్వాదించాడు. బ్యాటింగ్ లేదా కెప్టెన్సీ ఏదైనా సరే… ఆయన కెరీర్‌లోనే అత్యుత్తమ దశ GTలోనే సాగింది. నాకైతే హార్దిక్ మళ్లీ గుజరాత్ టైటాన్స్‌కే వెళ్తాడని అనిపిస్తోంది అని అశ్విన్ అన్నారు.

గుజరాత్ టైటాన్స్ జట్టుతో హార్దిక్‌కు ఎంతో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి (2022లో టైటిల్ విజేతగా, 2023లో రన్నరప్‌గా నిలిపారు).ముంబై ఇండియన్స్‌తో టైటిల్ గెలవలేకపోయినా, గుజరాత్‌తో మళ్లీ గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఆయన భావించవచ్చు.గుజరాత్ హోమ్ మైదానం మంచి బ్యాటింగ్ ట్రాక్ కావడం కూడా ఆయనకు కలసివస్తుంది.

Also Read:టెక్నాలజీ నన్ను కాపాడింది!

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నందున హార్దిక్‌కు మళ్లీ నాయకత్వ బాధ్యతలు లభించడం కష్టమే. అయినప్పటికీ ఒక ఆటగాడిగా గుజరాత్‌కు తిరిగి వెళ్లడాన్ని హార్దిక్ పరిశీలించాలని, అది జరిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -