ఆసీస్ జట్టుపై పాంటింగ్ ఫైర్

1
- Advertisement -

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు చూపుతున్న పేలవ ప్రదర్శనపై ఆ దేశ మాజీ సారథి రికీ పాంటింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 189 పరుగులకే కుప్పకూలడమే కాకుండా, బౌలింగ్‌లోనూ బంగ్లాదేశ్‌ను కట్టడి చేయలేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

డార్విన్‌లోని మార్రారా స్టేడియం వేదికగా ఆగస్టు 13న ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆస్ట్రేలియాను ఆరంభం నుంచే ఒత్తిడిలోకి నెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 189 పరుగులకే ఆలౌట్ చేయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తూ 80 ఓవర్లు ముగిసేసరికి 90 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మొదటి రెండు రోజుల్లో బంగ్లాదేశ్ చూపిన ఆధిపత్యం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ పరిణామాలపై మాట్లాడిన రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల విధానాన్ని, సాంకేతిక లోపాలను ప్రశ్నించారు. సీజన్ ఆరంభంలో ఉండే అలసత్వ స్పష్టంగా కనిపిస్తోంది. వారు చాలా కాలంగా మ్యాచ్‌లు ఆడలేదు, అంతమాత్రాన టాప్ ఆర్డర్ బ్యాటర్లలో కనిపించిన సాంకేతిక లోపాలను సమర్థించుకోలేం. ప్రాక్టీస్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 54 పరుగులకే ఆలౌట్ అయిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. నిన్నటి ఉదయం ఉన్న పిచ్ పరిస్థితికి ఆసీస్ పేసర్లు బౌలింగ్ చేసి ఉంటే ప్రత్యర్థికి ఆడటం అసాధ్యంగా మారేది” అని ‘సెన్ ఫైర్‌బాల్’ కార్యక్రమం ద్వారా పాంటింగ్ వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియా జట్టు వయస్సు పైబడుతోందని త్వరలోనే జట్టులో మార్పులు అనివార్యమని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌తో మొదటి రోజు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 1928 తర్వాత అత్యంత ఎక్కువ సగటు వయసు కలిగిన జట్టుగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. నిన్నటి జట్టు 1928 తర్వాత అత్యంత వయసైన జట్టు. జట్టు పునర్నిర్మాణం (Rebuild) గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది. క్యామరాన్ గ్రీన్ తప్ప జట్టులోని మిగతా ఆటగాళ్లందరూ 30 ఏళ్లకు పైబడినవారే. రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ముగిసేసరికి వారు 21 టెస్టులు ఆడాల్సి ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో, విదేశాల్లో సౌతాఫ్రికా మరియు భారతదేశంతో కీలక సిరీస్‌లు ఉన్నాయి అని ఆయన వివరించారు.

Also Read:టెక్నాలజీ నన్ను కాపాడింది!

- Advertisement -