ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో 1వ రోజు ఒక వికెట్ గండం నుండి తృటిలో తప్పించుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎబాదత్ హొస్సేన్ వేసిన బంతి తన బ్యాట్‌కు తాకిందని స్టీవ్ స్మిత్ బహిరంగంగా అంగీకరించాడు అయితే డిఆర్‌ఎస్ (DRS) వల్ల బతికిపోయానని సంతోషం వ్యక్తం చేశాడు.
డార్విన్‌లోని మార్రారా స్టేడియంలో ఆగస్టు 13 నుండి ప్రారంభమైన రెండు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ చేయడంతో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు ఊహించని షాక్ తగిలింది.
బంగ్లాదేశ్ బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను కేవలం 198 పరుగులకే పరిమితం చేసింది. జట్టు బ్యాటింగ్ లైనప్ మొత్తం కుప్పకూలింది. అయితే స్టీవ్ స్మిత్ 109 బంతుల్లో 71 పరుగులు చేసి పోరాడకపోయి ఉంటే ఆస్ట్రేలియా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది.
అయితే స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి, వాటిలో అత్యంత ముఖ్యమైనది రివ్యూ ద్వారా అతను ‘నాట్ అవుట్’గా నిలవడం. 21వ ఓవర్‌లో ఎబాదత్ హొస్సేన్ వేసిన బంతి స్మిత్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ వైపు వెళ్ళింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నప్పటికీ, అంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ రివ్యూకి వెళ్లినప్పటికీ, డిఆర్‌ఎస్ (DRS) లో బ్యాట్‌కు బంతి తాకినట్లు ఏమీ కనిపించలేదు.
దీనిపై మాట్లాడిన స్మిత్ ఆ క్షణంలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు తనకు అనిపించిందని…అంపైర్ అవుట్ ఇచ్చి ఉంటే తాను మైదానం వీడి వెళ్ళిపోయేవాడినని అంగీకరించాడు. నేను అనుకోవడం నిజమే అవును. నేను అదృష్టవంతుడినా? అవును, అలాగే కనిపిస్తోంది. కొన్నిసార్లు దాన్ని స్వీకరించాల్సిందే. సాధారణంగా డిఆర్‌ఎస్ చాలా బాగుంటుంది. బహుశా బ్యాట్‌కు తగలలేదేమో, నాకు తెలియదు. కానీ నాకు ఖచ్చితంగా ఏదో తగిలినట్లు అనిపించింది. ఒకవేళ అంపైర్ అవుట్ ఇచ్చి ఉంటే, నేను నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. కానీ అవును, ఈ రోజు సాంతికత నన్ను కాపాడింది స్టీవ్ స్మిత్ చెప్పాడు.
Also Read:రాజ్యసభలో ఖర్గే సంచలనం!

