సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధర్మన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్ర బృందం ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ చిత్రీకరణలో నిమగ్నమైంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ‘ది డెడ్లీ డాక్టర్’ అనే క్యాప్షన్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవలే మేకర్స్ రెండవ షెడ్యూల్ ప్రారంభించిన సందర్భంగా ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. షూటింగ్ సెట్స్‌లో రజినీకాంత్ లుక్‌కు సంబంధించిన గ్లింప్స్ ఇందులో కనిపించడంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన అతిపెద్ద విశేషం కమల్ హాసన్, రజినీకాంత్ ల కలయిక. దాదాపు ఐదు దశాబ్దాలుగా భారతీయ చిత్రసీమను ఏలుతున్న ఈ ఇద్దరు దిగ్గజ తారలు… నిర్మాత-నటుడి రూపంలో ఒక ప్రత్యేకమైన కాంబినేషన్‌లో ముందుకు వస్తున్నారు. కమల్ హాసన్ కు చెందిన ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ (RKFI) పతాకంపై రజినీకాంత్ నటిస్తున్న తొలి చిత్రం ఇది కావడం విశేషం.
Also Read:టెక్నాలజీ నన్ను కాపాడింది!
రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ మరియు ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిస్నీ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ అశ్విత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రజినీకాంత్‌కు జోడీగా సిమ్రాన్, రాశి ఖన్నా ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.రజినీకాంత్ పవర్ ఫుల్ డాక్టర్ అవతారంలో కనిపించనుండడం, దానికి తోడు రజినీ-కమల్ కాంబినేషన్ కావడంతో ‘ధర్మన్’ సినిమా భారతీయ చిత్రసీమలోనే మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

