విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ: పీవీ సింధు

198
pv
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పీవీ సింధు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన అనంతరం ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రంగనాయకుల మండపంలో సింధుకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సింధు…శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో త్వరలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ప్రారంభిస్తామని, యువతను ప్రోత్వహించేందుకే అకాడమీ ఏర్పాటు చేస్తున్నానని తెలిపింది. చాలా మంది యువత సరైన ప్రోత్సాహం లేక వెనుకబడుతున్నారని వారికి తగిన ప్రోత్సాహం అందిస్తానని వెల్లడించింది.

- Advertisement -