పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రస్థానం సెమీఫైనల్స్‌లోనే ముగిసింది. జపాన్ స్టార్ ప్లేయర్ అకానె యామగుచి 22-20, 21-12 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకో సింధు నిష్క్రమించింది. బ్యాడ్మింటన్ సర్క్యూట్‌లో అత్యంత ప్రతిభావంతులైన ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోరు వరుస గేముల్లోనే ముగిసింది. యామగుచి 22-20, 21-12 తో విజయం సాధించి ఆదివారం జరగబోయే టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
వీరిద్దరి మధ్య జరిగిన గత ఆరు మ్యాచ్‌ల్లో సింధుకు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.అయితే మొదటి గేమ్ ప్రారంభంలో సింధు ఆ ఓటమి రికార్డును తిరగరాసేలా కనిపించింది. మ్యాచ్ ఆరంభంలోనే భారత స్టార్ ప్లేయర్ ఆధిక్యం సాధించి, మిడ్-గేమ్ విరామం వరకు అదే ఊపును కొనసాగించింది. అటాకింగ్ గేమ్‌తో పాటు బ్యాక్ కోర్ట్ నుండి అద్భుతమైన షాట్లతో పాయింట్లు సాధిస్తూ ఆత్మవిశ్వాసంతో కనిపించింది. కానీ యామగుచి తర్వాత తన సత్తాచాటుతూ సింధుపై పూర్తి ఆధిపత్యం సాధించింది.
ఈ విజయంతో యామగుచి వరుసగా నాలుగో టూర్ ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు థాయిలాండ్ ఓపెన్ గెలిచిన ఆమె ఆ తర్వాత సింగపూర్ ఓపెన్ మరియు ఇండోనేషియా ఓపెన్‌లలో రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు ఆమె ఆదివారం జరిగే ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో థాయిలాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చోచువాంగ్‌తో తలపడనుంది.
Also Read:రోజు పదివేల అడుగులు నడుస్తున్నారా?

