కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇచ్చి, పండబెట్టి పదవులు తీసుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు షబ్బీర్ అలీ.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ డబ్బులు తీసుకొని పదవులు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. దీంతో షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు పంపింది క్రమశిక్షణ కమిటీ. దీనికి షబ్బీర్ అలీ ఏ విధంగా స్పందిస్తాతరో వేచిచూడాలి.
కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయే పార్టీగా తయారైంది అని ఆరోపణలు గుప్పించారు షబ్బీర్ అలీ. డబ్బులు పెట్టి, పండబెట్టి పదవులు తీసుకుంటున్నారు అని టీపీసీసీ చీఫ్ పై ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ కార్యకర్తలతో షబ్బీర్ అలీ మాట్లాడిన కాల్ రికార్డింగ్ లీక్ కావడంతో ఈ విషయం వెలుగులోకి ఇవచ్చింది.
Also Read:ఆస్ట్రేలియన్ ఓపెన్..సింధు ఔట్

