చంద్రబాబు పేరుతో సైబర్ మోసం

2
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో వీడియో కాల్ చేసి సైబర్ మోసానికి పాల్పడ్డారు.వీడియో కాల్‌తో నమ్మించి రూ.80 వేలు కాజేశారు సైబర్ నేరగాళ్లు.

సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌ పేర్లు వాడుకొని ఏఐతో బురిడీ కొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ‌‌దేవినేని ఉమా ఫోటోతో వాట్సప్ ఖాతా తెరిచి చంద్రబాబు లాగా వీడియో కాల్ మాట్లాడి బురిడీ కొట్టించారు కేటుగాళ్లు.

విశాఖ‌పట్నంలో సీతంపేటలోని భూ వివాదాన్ని పరిష్కరిస్తామని…జీవీఎంసీ కమిషనర్‌పై లంచం ఆరోపణలు నిరూపిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి.. దశలవారీగా రూ.80 వేలు వసూలు చేశారని బాధితుడు తెలిపారు. మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు బాధితుడు శ్రీనివాస్ రెడ్డి.

Also Read:రోజు పదివేల అడుగులు నడుస్తున్నారా?

- Advertisement -