సెమీఫైనల్లో పీవీ సింధు ఓటమి..

47
PV Sindh

భారత బ్యాడ్మింట‌న్ సెన్షేష‌న్ పుస‌ర్ల వెంక‌ట సింధు టోక్యో ఒలింపిక్స్ వుమెన్ సింగిల్స్ సెమీస్‌లో ఓట‌మిపాలైంది. వరల్డ్ నెంబర్ తై జు యింగ్ (చైనీస్ తైపే) తో ఈ రోజు జరిగిన పోరులో సింధు 18-21, 12-21తో పరాజయం చవిచూసింది. తొలి గేమ్ లో పోరాడిన సింధు, రెండో గేమ్ ఆరంభంలో ఫర్వాలేదనిపించినా, ఆపై క్రమేణా మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. శక్తిమంతమైన షాట్లు, తెలివైన క్రాస్ కోర్టు ఆటతీరుతో తై జు యింగ్ మ్యాచ్ ను తన వశం చేసుకుంది. ఇక సింధు రేపు కాంస్యం కోసం జరిగే మ్యాచ్ లో ఆడనుంది.