ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు- మెగాస్టార్

97

ప్రముఖ సినీన‌టుడు అల్లు రామలింగయ్య తెలుగు వారికి ఈ పేరును పరిచయం చేయనక్కర్లేదు. నాటి తరం నేటి తరం వరకు ప్రతీ ఒక్క తెలుగు వ్యక్తికి ఆయన పేరు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా సినీ అభిమానులకు ఆయన ఎప్పుడూ ప్రత్యేకమే. ఆయన వేసిన పాత్రలు, తరతరాలను నవ్వించిన తీరు ఎప్పటికీ చిరస్మరణీయమే. అల్లు రామ‌లింగ‌య్య‌ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నివాళి అర్పించారు. గ‌తంలో అల్లు రామ‌లింగ‌య్య ఫొటో వ‌ద్ద తాను నివాళులు అర్పించినప్పటి ఫొటోను చిరంజీవి పోస్ట్ చేశారు. ‘శ్రీ అల్లు రామలింగయ్య గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయి. ఒక డాక్టర్ గా, యాక్టర్ గా, ఫిలాసఫర్ గా, ఓ అద్భుతమైన మనిషిగా, నాకు మావయ్యగా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను మరోసారి నెమరువేసుకుంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.