తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యం లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు లండన్ వేదికగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీ పి వి నరసింహ రావు జయంతి ఘనం గ నిర్వహించడం జరిగింది. కార్యక్రమం లో ప్రధానవక్త గ జయప్రకాశ్ నారాయణ్ ( రిటైర్డ్ ఐఏఎస్ ) వక్తలు గా ,వాణి దేవి ( విద్యావేత్త ,పి వి కూతురు ) ,లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ ,మహేష్ బిగాల ( ప్రభుత్వ పి వి శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు ) పాల్గొని ప్రసంగించారు .యూకే ,అమెరికా ,కెనడా ,ఆస్ట్రేలియా ,ఐర్లాండ్,జర్మనీ,దుబాయ్ ,బహరేన్ ,వివిధ దేశాల నుండి శాస్త్రవేత్తలు , బారిస్టర్ లు , డాక్టర్ లు , విద్యావేత్తలు , సాఫ్ట్ వీర్ నిపుణులు , భారత సంతతి యూకే రాజకీయ ప్రతినిధులు , తెలంగాణ ,తెలుగు సంఘాల ప్రతినిధులు 9 టీడీఫ్ ,జాగృతి ,యుక్త ,తాల్ ,తార ,) ఇలా వివిధ రంగాలకు చెందిన 130 మంది ఎన్నారై లు పాల్గొన్నారు.
ప్రసంగాల అనంతరం జయప్రకాశ్ ,వాణి దేవి లతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ :చైనా ని సంస్కరణ లు తెచ్చి Deng Xiaoping ఎలా అభివృద్ధి పథం లో పెట్టారో పివిఎన్ దేశాన్ని ఆర్ధిక సంస్కరణల తో దేశాన్ని గాడిలోపెట్టారు ,నాటి నుండి నేటి వరకు పనిచేసిన ప్రధానులు అంతా కూడా పివిఎన్ విధానాలనే అనుసరిస్తున్నారు ,పంజాబ్ లో శాంతి నెలకొల్పడం లో సఫలం అయ్యారు ,కాశ్మీర్ అంశాన్ని పరిష్కారం లో చాలావరకు సఫలం అయ్యారనే చెప్పుకోవొచ్చు , ఇంకో 15 ఏండ్లు పివిఎన్ ప్రధాని గ ఉండిఉంటే చైనా ని మించి అభివృద్ధి అధిగమించేవాళ్ళం అనడం లో ఎలాంటి సందేహం లేదని చెప్పారు .ఎంత పని చేసిన కూడా కీర్తికాంక్ష కోరుకోలేదు ,వ్యక్తి ప్రతిష్ట కి పాకులాడని వ్యక్తి ,తన ఆలోచనలు ,విధానాలతో వేరే వారికి పేరు తెచ్చిపెట్టిన కూడా సాధాసీదా గ తనపని తానూ చేసుకోవడమే తప్ప కీర్తికోసం ఉబలాట పడలేదని అన్నారు.
పి వి నరసింహారావు తనయా వాణి దేవి మాట్లాడుతూ : ఎవరి నాన్న వారికి హీరో ,కానీ పివిఎన్ గారి కూతురు గ గర్వపడాలిసిన అంశం అని అన్నారు . స్థితప్రజ్ఞ గ కొనియాడారు ,ఎలాంటి సందర్భాల్లోనూ కోపం రాని వ్యక్తి , సమయపాలన ,క్రమశిక్షణ అయన విజయానికి మెట్లు అని అన్నారు , నాన్నమ్మ చెప్పిన ప్రకారం బాల్యం నుండే ఏకసంత్ర గ్రహి అని చెప్పేవారని రెండున్నర ఏండ్ల వయసులోనే కఠిన పద్యాలు కంఠస్తం చేసేవారని చెప్పారు , నాన్న ని మౌనం గ ఉన్నారు ,మృదుస్వభావి అంటారు కానీ ఆ సమయం లో మహారాష్ట్ర లో ఉన్నప్పుడు తుపాకుల శిక్షణ ఇచ్చారని తెలిపారు. జైళ్లశాఖ మొదలు ప్రధాని గ వివిధ శాఖల్లో సమూలమార్పులు తెచ్చి దేశాభివృద్ధి లో భాగస్వామ్యం అయ్యారు . పి వి రచనలు,వివిధ దేశాల్లో అందుకున్న బహుమతులు ,వారు ఉపయోగించిన ఇష్టమైన వస్తువులు అన్ని కలిపి మ్యూజియం ఏర్పాటు చేశామని తెలిపారు .