అసెంబ్లీలో పీవీ చిత్రపటం ఆవిష్కరణ..

45

తెలంగాణ శాసనసభలో శాసనసభ్యుల లాంజ్‌లో మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ, స్వర్గీయ పివీ నరసింహా రావు చిత్రపటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, పివి నరసింహా రావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు, ఎంపీ కే కేశవ రావు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ విపక్ష నాయకులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పివి నరసింహా రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.