టీడీఎఫ్‌ యూకే ఆధ్వర్యంలో పీవీ జయంతి..

183
pv

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు పిలుపు మేరకు మన రాష్ట్ర పురపాలక మరియు ఐ.టి శాఖ మంత్రి కె.టి. రామారావు, రెండు రోజుల క్రితం వీడియో సమావేశంలో విదేశాలలో ఉన్న తెలుగు మరియు తెలంగాణ సంఘాలతో పి.వి.నరసింహరావు శత జయంతి ఉత్సవాల గురించి మాట్లాడం జరిగింది. ఇందులో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం పాటు నిర్వహించ దలిచిన పి.వి.నరసింహరావు శతాభ్ధి సంబరాలు నిర్వించడం అనే విషయం అందరిని ఆకట్టుకుంది. అలాగే కె.టి.రామారావు అన్నీ విదేశాలాలో వున్న సంఘాలను కూడ ఉత్సవాలు చేయమని విఘ్న్యప్తి చేయడం మరియు అన్నీ తెలుగు సంఘాలు అంగీకరించడం జరిగినది.

ఆ స్పూర్తితో మేము అనగా తెలంగాణ డెవలెప్మెంట్ ఫోరం యుకె, యూరప్‌, లండన్‌ సంఘ సభ్యులం ఈ రోజు పి.వి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకొవడం మరియు నివాళులు అర్పించడం విశేషం. ఈ సందర్భంగా అధ్యక్షులు బైరు శ్రవణ్ కుమార్ గౌడ్ మాట్లాడు.. పి.వి గురించి చాల విషయాలు గొప్పగా చెప్పడం జరిగినది. కరోనా కారణంగా తక్కువ మంది రావడం జరిగినది. ఈ అవకాశం ఇచ్చినందుకు టి.డి.ఎఫ్ సభ్యులు తెలంగాణ రాష్త్ర ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. మా తరుపున పి వి కి ‘భారత రత్న ‘ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతు రాష్ట్ర ప్రభుత్వాన్నికి విన్నపం చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో మాకు అవకాశం ఇంచ్చిన ఎన్. ఆర్ .ఐ కోవార్డినేటర్ మహేష్ బిగాలకి మరియు అనిల్ కూర్మచలంకి అభినందనలు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన తెలంగాణ డెవలెప్మెంట్ ఫోరం యుకె, యూరప్‌ సభ్యులు కమల్‌ ఓరుగంటి, శ్రీనివాస్‌ రెడ్డి పింగళి, రాజు చక్రి, శ్రవణ్‌ ఉప్పల, జూపల్లి ప్రవీణ్‌, నాగ రాజు అడ్డగల్ల, శ్రీకాంత్‌ కాంచనపల్లి, మాదాల శ్రీనివాస్‌, శ్రీకాంత్‌ బెల్డె, నగేష బత్తుల, వెంకట్, భాగ్య సజ్జన్‌, జయ షీల నామ, కష్మీర, లత లు పాల్గొన్నారు.