ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ అధ్వర్యంలో పీవీ శత జయంతి ఉత్సవాలు

169
PV

దక్షిణాది మొదటి ప్రధాని ,విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన , బహు బాషా కోవిదుడు మన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావు శత జయంతి ఉత్సవాలను మన రాష్ట్ర సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు విదేశీ గడ్డ పై మొదటి ఉత్సవాలను ఆస్ట్రియా లో కంది వంశీ రెడ్డి అద్వర్యం లో ఘనంగా నిర్వహించారు .మన తెలంగాణ గొప్పతనం తో పాటు , ఈ గడ్డ పై జన్మించిన మన ఆణిముత్యాలను గుర్తించి ప్రపంచానికి తెలియజేయడం లో భాగంగా PV జయంతి ని సంవత్సరం పాటు ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 50 దేశాలలో ఘనంగా నిర్వహించ తలపెట్టిన కెసిఆర్ కి కంది వంశీ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు .

సభ్యులందరు పీవీ చిత్రపటానికి పుష్పాలు సమర్పించుకుని పీవీ ని స్మరించుకున్నారు .భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి పివి అన్నారు. .ఈ కార్యక్రమం లో కంది వంశీ సతీష్ సత్తిరెడ్డి కేశవ్ నరేష్ మనిష్ శ్రీనివాస్ సత్య గోపీ మరియు తదితరులు పాల్గొన్నారు .