ఒమాన్‌లో పీవీ శత జయంతి ఉత్సవాలు..

226
Telangana Jagruthi
- Advertisement -

బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఖ్యాతిని దేశవిదేశాల్లో తెలియజేసేలా నిర్వహించేల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు ఒమాన్‌లో తెలంగాణ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ మరియు తెలంగాణ జాగృతి ఒమాన్ శాఖలు సంయుక్తంగా పీవీ నర్సింహ రావుశాతాబ్ది ఉత్సాహలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా టీఆరెస్ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏడాది పొడుగునా నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయన సేవలను, కృషిని చాటి చెప్పేలా చేస్తున్న ప్రయత్నానికి హర్షం వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తెలంగాణ నుంచి ఎంపికైన తొలి ముఖ్యమంత్రి గానే కాదు, తెలుగు జాతి అంతా సగర్వంగా చెప్పుకునేలా దక్షిణ భారతదేశం నుంచే ప్రధాని పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి వ్యక్తిగా పీవీ ప్రత్యేక గౌరవం పొందారు. ఒక్క రాజకీయ రంగమే కాదు, సాహిత్యంలోనూ వారి సృజన ఎంతో ఎన్నదగింది.

కవిగా, కథకునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాద రచయితగా, విమర్శకునిగా వారిది విశ్వరూపమే. పద్దెనిమిది భాషలలోనూ వారు నిష్ణాతులు. వారికి అర్థశాస్త్రంలో ఎంత పట్టుందో, ఆధ్యాత్మిక విషయాలలోనూ అంతే పట్టుంది.ఈ శతాబ్ది దేశ చరిత్రలో ఇంతటి విశిష్ట విలక్షణ, బహుముఖ ప్రతిభాశాలి పీవీ ఒక్కరే అని ఈ సందర్భంగా పీవీ మధుర స్మృతులు తలుచుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఒమాన్ శాఖ అధ్యక్షుడు గుండు రాజేందర్ నేత, టీఆరెస్ ఒమాన్ ఉపాధ్యక్షుడు షైక్ అహ్మద్,ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ,కార్యదర్శి సాయి కుమార్ చౌదరి, నర్సయ్య,వీరేందర్, అజయ్,లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -