గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న గాయని పర్ణిక మన్య..

26
Singer Parnika Manya

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సింగర్ సాకేత్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ సనత్ నగర్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు గాయని పర్ణిక మాన్య. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు. పచ్చదనం పెంచాలని అందరికీ ఇష్టం ఉంటుందని.. చాలామంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను చూసి మొక్కలను నాటుతున్నారని.. నాకు ఈ చాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా అన్న ఒక మాట గుర్తుకు వస్తుంది మన ముందున్న ఛాలెంజ్ భవిష్యత్ తరానికి పచ్చని చెట్లను ఇవ్వడమే అని అన్నారు. ఎంత పెద్ద ఎత్తున చెట్లు పెంచితే అంత మంచి ఆరోగ్యం మనకు ఉంటుంది. కరోనా వైరస్ లాంటి ఇంతపెద్ద సందర్భంలో కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు మొక్కల నాటించడం చాలా అభినందనీయమని అన్నారు.

ప్రతి ఒక్కరూ విధిగా వారికి తోచిన విధంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తాను మరో ముగ్గురు గాయకులకు నోయేల్ సేన్, శ్రీ క్రిష్ణ, సోనీ కోమందురీలకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఒక పాటను పాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.