నాటిన మొక్కలను బ్రతికించే బాధ్యత మనదేః మంత్రి కేటీఆర్

300
ktr
- Advertisement -

హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్. నల్గొండ మున్సిపాలిటీ లో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ప్రారంభించి, హరితహారం మొక్కలు నాటి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేశారు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి. ఈకార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, మండలి విప్ కర్నే ప్రభాకర్, ఎంపీ లింగయ్య యాదవ్ పలువురు నాయకులు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…కొత్త మున్సిపాలిటీ చట్టంతో పట్టణాలకు ప్రాణాళికబద్ధమైన అభివృద్ధి కి బాటలు వేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపాలిటీ లకు, పంచాయితీ లకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు.పంచాయితీలకు రూ.338కోట్లు, మున్సిపాలిటీలకు 178కోట్లు నెల నెల మొదటివారం లోనే నిధులు మంజూరు అవుతున్నాయి అన్నారు. అన్ని పట్టణాల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంతటి కరోనా సంక్షోభంలో కూడా అన్ని పథకాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిరైతుకు రైతుబంధు డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. నల్గొండ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు డబ్బులు మంజూరు చేసినట్లు చెప్పారు. వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో రెండు మెడికల్ కాలేజ్ లను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు.

- Advertisement -