- Advertisement -
6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లాలోని ముస్తఫానగర్ అగ్రహారం రోడ్డులో అజయ్‌కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, అటవీశాఖ అధికారి ప్రవీణ, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు ఉన్నారు.
- Advertisement -