కరోనా కష్టంలో అధికారులు బాగా పనిచేస్తున్నారని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ ఆలోచన , ఆచరణ, అధికారుల పని తీరు వల్లే కరోనా ను అడ్డుకున్నాం అన్నారు. అగ్ర దేశాలకు కూడా సాధ్యం కాని విధంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
మా ట్రస్టు ద్వారా ఉడతా భక్తి గా అధికారులు , సిబ్బందికి సానిటైజర్లు , మాస్కులు అందిస్తున్నామని ….తన వంతు ఎలాంటి సాయం కావాలన్న అందజేస్తామని తెలిపారు.
రెండు జిల్లాలకు 20 వేల లీటర్ల సానిటైజర్ ను శ్రీనివాస్ రెడ్డి అందజేయడం అబినందనీయమన్నారు.కోటి రూపాయల సాయాన్ని శ్రీనివాస్ రెడ్జి ట్రస్టు ద్వారా రెండు జిల్లాలకు అందించారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని…ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఖమ్మం జిల్లా లో లేదన్నారు.
కంటైన్ మెంట్ జోన్ లో గడువు ముగిసిన తర్వాత మినహాయింపు ఇస్తామని..ప్రజలు మే-7వ వరకు లాక్ డౌన్ పాటించాల్సిందేనని చెప్పారు. ఖమ్మం , కొత్తగూడెం జిల్లాల అధికారులు అద్భుతం గా పని చేశారని…కష్టకాలంలో చాలామంది దాతృత్వం చూపారని చెప్పారు.