- Advertisement -
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు.
ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12 వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరపనున్నారు. పుష్ప చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు, ఫాహద్ ఫాజిల్ , సునీల్ ,అనసూయ, అజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
- Advertisement -