ప్రాజెక్టు కే…అప్‌డేట్

55
project k

సాహో తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ప్రభాస్. ఇప్పటికే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉండగా తాజాగా ప్రభాస్ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “ప్రాజెక్ట్ కే”.

వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మిక్కీ జె మేయర్ సౌండ్‌ట్రాక్‌ను అందిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈరోజు “ప్రాజెక్ట్ కే” షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో డార్లింగ్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉదయం నుంచే “ప్రాజెక్ట్ కే” చిత్రాన్ని ట్రెండ్ చేస్తున్నారు.